ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 16:14:25

84 ఏండ్ల వృద్ధుడికి డీఎన్‌ఏ పరీక్ష

84 ఏండ్ల వృద్ధుడికి డీఎన్‌ఏ పరీక్ష

న్యూఢిల్లీ : ఓ తీవ్రమైన కేసులో 84 ఏండ్ల వృద్ధుడికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 14 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి తల్లిని చేసినట్లు ఆరోపణలపై అరెస్టయిన ఈయన ప్రస్తుతం జైలులో ఉన్నాడు. బాధితురాలికి పుట్టిన పిల్లాడికి తండ్రి నిందితుడైన వృద్ధుడేనా అన్ని నిర్ధారించడానికి డీఎన్‌ఏ పరీక్ష జరుపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితురాలిపై లైంగికదాడి చేయలేదని నిందితుడు చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లాడితోపాటు నిందితుడైన వృద్ధుడికి కూడా డిఎన్ఏ పరీక్ష చేసి.. నిందితుడు నిజంగా పిల్లాడి తండ్రి అని తెలుసుకునే వీలుంది.

మైనర్పై లైంగికదాడి చేసిన ఆరోపణలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన అనంతరం నిందితుడిని జైలుకు పంపారు. తనకిప్పుడు 84 ఏండ్ల వయసు ఉన్నదని, లైంగికదాడి చేసేంత వయసు తనకు లేదని కోర్టుకు విన్నవించాడు. నిందితుడు కోల్‌కతా హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేశాడు. అయితే, కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. వృద్ధుడు లైంగిక కార్యకలాపాలకు సమర్థుడని నిరూపించేందుకు తమ వద్ద ఆధారాలేవీ లేవని పశ్చిమ బెంగాల్ పోలీసులు తన నివేదికలో పేర్కొన్నారు.

విశేషమేమిటంటే, బాధితురాలు ఈ నెల ఐదో తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడి నమూనాలను పోలీసులు ఇప్పటికే డీఎన్‌ఏ పరీక్ష కోసం తీసుకున్నారు. ఈ డీఎన్‌ఏ పరీక్ష మూడు వారాల్లో జరుగుతుంది. 2019 నవంబర్‌లో 13 ఏండ్ల వయసులో ఉన్న బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు.

నిందితుడు తరఫున బెయిల్ దరఖాస్తుపై కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది కపిల్ సిబల్.. జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. బెయిల్ కోసం నిందితుడి వయసు, వైద్య పరిస్థితిని కూడా కోర్టుకు సిబల్ పేర్కొన్నారు. 


logo