గురువారం 09 జూలై 2020
National - Jun 23, 2020 , 01:58:50

జనాల్లేకుండా జగన్నాథ యాత్ర

జనాల్లేకుండా జగన్నాథ యాత్ర

  • పూరీ యాత్రపై స్టే ఎత్తేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, జూన్‌ 22: పూరీ జగన్నాథ రథయాత్రపై విధించిన స్టేను సుప్రీం కోర్టు ఎత్తేసింది. యాత్ర నిర్వహణకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో సంప్రదాయం ప్రకారం జూన్‌ 23నే(మంగళవారం) రథయాత్ర జరుగనుంది. యాత్ర సమయంలో పూరీ నగరంలో కర్ఫ్యూ విధించాలని, ఒక్కో రథాన్ని 500 కంటే ఎక్కువ మంది లాగకూడదని, కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వారే రథాన్ని లాగాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేవలం పూరీలో మాత్రమే రథయాత్రను నిర్వహించాలని, రాష్ట్రంలోని ఇతర చోట్ల ఎక్కడా జరుపకూడదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఒడిశా ప్రభుత్వాన్ని కోరింది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పూరీ యాత్రపై జూన్‌ 18న సుప్రీం కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. రథయాత్రపై స్టే ఆదేశాలను సవరించాలని కేంద్రం కోరడంతో సోమవారం  ధర్మాసనం స్టేను ఎత్తేసింది. రథయాత్రకు అనుమతినివ్వడంతో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కోర్టుకు కృతజ్ఞతలు  తెలిపారు.


logo