గురువారం 28 జనవరి 2021
National - Nov 24, 2020 , 16:57:27

సుప్రీంకోర్టులో ఆర్న‌బ్ పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా

సుప్రీంకోర్టులో ఆర్న‌బ్ పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా

న్యూఢిల్లీ: రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ ఆర్న‌బ్ గోస్వామి పిటిష‌న్‌పై విచార‌ణ‌ను సుప్రీంకోర్టు రెండు వారాల‌పాటు వాయిదా వేసింది. మ‌హారాష్ట్ర అసెంబ్లీ సెక్రెట‌రీ త‌న‌కు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీస్‌ను వ్య‌తిరేకిస్తూ ఆర్న‌బ్ గోస్వామి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌ను ఇవాళ విచార‌ణ‌కు స్వీక‌రించిన దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.. విచార‌ణ‌ను రెండు వారాల‌పాటు వాయిదా వేసింది. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక‌రేపై అనుచిత వ్యాఖ్యలు చేయ‌డంతో ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్య‌ద‌ర్శి.. ఆర్న‌బ్ గోస్వామికి ప్రివిలేజ్ నోటీస్ ఇష్యూ చేశారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo