మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 05, 2020 , 14:58:58

మిస్సైల్‌ టార్పిడో ప‌రీక్ష విజ‌య‌వంతం.. వీడియో

మిస్సైల్‌ టార్పిడో ప‌రీక్ష విజ‌య‌వంతం.. వీడియో

హైద‌రాబాద్‌: సూప‌ర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెట్ రిలీజ్ ఆఫ్ టార్పిడో(స్మార్ట్‌)ను ఇవాళ విజ‌య‌వంతంగా పరీక్షించారు.  ఒడిశాలోని వీల‌ర్ ఐలాండ్ నుంచి దీన్ని ప్ర‌యోగించారు.  తీరం వెంట ఉన్న ట్రాకింగ్ స్టేష‌న్లు.. టెలిమెట్రీ స్టేష‌న్లు టార్పిడో గ‌మ‌నాన్ని మానిట‌ర్ చేశాయి.  ట్రాకింగ్ స్టేష‌న్ల‌లో ఉన్న రేడార్లు, ఎల‌క్ట్రో ఆప్టిక‌ల్ సిస్ట‌మ్‌లు మిస్సైల్ టార్పిడోను ప‌రీక్షించాయి. లైట్ వెయిట్ యాంటీ స‌బ్‌మెరైన్ టార్పిడోల‌ను మిస్సైళ్ల ద్వారా రిలీజ్ చేయ‌డం ఈ ప‌రీక్ష‌లో విశేషం.  టార్పిడో రేంజ్‌లో లేని యుద్ధాల్లో ఇలాంటి వినియోగం ఉంటుంది.