గురువారం 16 జూలై 2020
National - Jul 01, 2020 , 02:44:31

యాప్స్‌పై అగ్రరాజ్యం ఆగ్రహం

యాప్స్‌పై అగ్రరాజ్యం ఆగ్రహం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ‘చైనా యాప్‌లపై నిషేధం’ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినియోగదారుల సమాచారాన్ని చైనాతో పాటు ఇతర దేశాలకు చేరవేస్తున్నాయని ఆరోపిస్తూ 59 చైనా యాప్స్‌పై భారత్‌ సోమవారం నిషేధం విధించింది. ఇప్పుడు టిక్‌టాక్‌ సహా పలు చైనా యాప్‌లపై అమెరికాకు చెందిన నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రజల సమాచారాన్ని కూడా ఆ యాప్‌లు డ్రాగన్‌ దేశానికి చేరవేస్తున్నాయని ఆరోపిస్తున్నారు


logo