మంగళవారం 31 మార్చి 2020
National - Feb 10, 2020 , 14:55:35

అలా అయితే పాకిస్థాన్‌కు వెళ్లిపోండి..

అలా అయితే పాకిస్థాన్‌కు వెళ్లిపోండి..

అలీఘడ్‌: ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎంపీ సతీశ్‌ గౌతమ్‌ ప్రముఖ సామాజిక కార్యకర్త సుమైయా రానాపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలీఘడ్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో సుమైయా రానా పాల్గొన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న అణచివేత చర్యలు..కనీసం ప్రజలు ఊపిరి తీసుకొనే అవకాశం లేకుండా చేస్తున్నాయని  సుమైయా రానా మండిపడ్డారు. దీనిపై ఎంపీ సతీశ్‌ గౌతమ్‌ స్పందిస్తూ సుమైయా రానాకు భారత్‌లో ఇబ్బందికరంగా అనిపిస్తే పాకిస్థాన్‌కు వెళ్లాలని సూచించారు. అంతేకాదు గత డిసెంబర్‌ 16 నుంచి సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సుమారు 150 మంది విద్యార్థులు అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీలో ఇప్పటికే ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నట్లు చెపారు. సుమైయా రానా ప్రముఖ ఉర్దూ కవి మునవ్వార్‌ రానా కూతురు. 


logo
>>>>>>