శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:06:19

దొంగ వేషం వేసిన ఎస్పీ! సిబ్బందిని పరీక్షించేందుకే

దొంగ వేషం వేసిన ఎస్పీ! సిబ్బందిని పరీక్షించేందుకే

లక్నో: ఆయన ఒక ఎస్పీ. తన కార్యాలయంలో పనిచేసే పోలీసు సిబ్బంది అన్ని వేళలా అప్రమత్తంగా ఉంటున్నారా.. లేదా తెలుసుకోవాలని ఆయనకు ఆలోచన వచ్చింది. వెంటనే ఖాకీ యూనిఫారం తీసి సాదా సీదా దుస్తులు ధరించాడు. దొంగోడిలా మొహానికి మాస్కు వేసుకున్నాడు. కార్యాలయం నుంచి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చి పారిపోయాడు. పోలీసులు ఆగు..ఆగు.. అని అరుస్తున్నా పట్టించుకోకుండా పరుగుత్తుతూనే ఉన్నాడు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు వెంబడించి నిమిషాల్లోనే ఆయనను పట్టుకున్నారు. మాస్కు తీసి చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటన యూపీలోని సుల్తాన్‌పూర్‌ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. ఎస్పీ పేరు శివ్‌ హరి మీనా. తన సిబ్బంది పనితీరుతో ముచ్చటపడ్డ ఆ ఎస్పీ ఒక్కొక్కరికి రూ. 21వేల నగదు బహుమతి అందజేశారు. ఆ సమయంలో తన కార్యాలయం వద్ద 8 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. logo