శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 25, 2021 , 01:24:34

రామమందిరానికి సుజనాచౌదరి 2.2 కోట్లు

రామమందిరానికి సుజనాచౌదరి 2.2 కోట్లు

హైదరాబాద్‌, జనవరి 24 (నమస్తే తెలంగాణ): అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాజ్యసభసభ్యుడు సుజనాచౌదరి తన తండ్రి యలమంచిలి జనార్దనరావు పేరిట కుటుంబం తరఫున రూ.2,2,32,000 విరాళం ప్రకటించారు. రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణలో భాగంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం ఏపీలోని విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ సుజనాచౌదరి హాజరై ఈ విరాళాన్ని ప్రకటించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్‌ రూ.5,00,116 ప్రటించారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ రూ.5 లక్షలు, సీసీఎల్‌ గ్రూప్‌ రూ.6.39 లక్షలు, సిద్ధార్థ అకాడమీ తరఫున రూ.15 లక్షలు విరాళం ప్రకటించారు.

VIDEOS

logo