మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 12:20:13

అక‌స్మాత్తు లాక్‌డౌన్‌తో దేశం షాకైంది : ఆనంద్ శ‌ర్మ‌

అక‌స్మాత్తు లాక్‌డౌన్‌తో దేశం షాకైంది : ఆనంద్ శ‌ర్మ‌

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 మ‌హ‌మ్మారిపై ఇవాళ రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది.  కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎంపీ ఆనంద్ శ‌ర్మ మాట్లాడారు. అక‌స్మాత్తుగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో యావ‌త్ దేశం షాక్‌కు గురైన‌ట్లు ఆరోపించారు. లాక్‌డౌన్ వ‌ల్ల 14 నుంచి 29 ల‌క్ష‌ల వ‌ర‌కు పాజిటివ్ కేసుల సంఖ్య‌ను త‌గ్గించామ‌ని ఆరోగ్య మంత్రి చెప్పార‌ని, దానికి ఏమైనా శాస్త్రీయ ఆధారం ఉందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ వివ‌క్ష‌కు గురైన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ప్రజా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసేందుకు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో కేంద్రం మాట్లాడాల‌ని ఆయ‌న సూచించారు. 70 శాతం ఐసీయూ బెడ్స్ అన్నీ ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో ఉన్న‌ట్లు చెప్పారు. లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న చేయ‌డానికి ముందు రాష్ట్రాల‌తో కేంద్రం సంప్ర‌దించాల్సి ఉంటే బాగుండేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. లాక్‌డౌన్ వేళ వ‌స‌ల కూలీల వెత‌ల‌ను ప్ర‌పంచం అంతా చూసింద‌ని విమ‌ర్శించారు. ఒక‌వేళ క్వారెంటైన్ సెంట‌ర్ల‌ను ముందే ఏర్పాటు చేసి ఉంటే, గ్రామాల వ‌ర‌కు వైర‌స్ చేరి ఉండేంది కాద‌న్నారు.  


logo