శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Nov 20, 2020 , 11:23:39

జైలు వ‌ద్ద‌నుకుంటే.. 62 వేల కోట్లు క‌ట్టాల్సిందే

జైలు వ‌ద్ద‌నుకుంటే.. 62 వేల కోట్లు క‌ట్టాల్సిందే

హైద‌రాబాద్‌:  స‌హారా ఇండియా ప‌రివార్ గ్రూపు అధినేత సుబ్ర‌తా రాయ్‌కు సెక్యూర్టీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఆల్టిమేటం జారీ చేసింది.  సుబ్ర‌తా రాయ్ త‌క్ష‌ణం 62,600 కోట్లు క‌ట్టాల‌ని లేదంటే ఆయ‌న‌కు పెరోల్ ఇవ్వకూడ‌ద‌ని సుప్రీంకోర్టులో సెబీ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. రాయ్‌కి చెందిన రెండు గ్రూపులు, వ‌డ్డీతో స‌హా మొత్తం 62,600 కోట్లు చెల్లించాల‌ని సెబీ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది. అయితే 8 ఏళ్ల క్రితం సుబ్ర‌తా రాయ్‌పై కేవ‌లం 25,700 కోట్లు మాత్ర‌మే భారం ఉండేది. 2012లో స‌హారా గ్రూపు కంపెనీలు సెక్యూర్టీ చ‌ట్టాల‌ను ఉల్లంఘించి సుమారు 3.5 బిలియ‌న్ల డాల‌ర్ల సొమ్మును స‌మీక‌రించిన‌ట్లు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఎటువంటి బ్యాంకింగ్ స‌దుపాయాలు లేన‌టువంటి ల‌క్ష‌ల సంఖ్య భార‌తీయుల నుంచి స‌హారా కంపెనీలు అక్ర‌మ రీతిలో సొమ్ము స‌మీక‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ల‌ను గుర్తించ‌డంలో విఫ‌ల‌మైన సెబీ.. ఈ కేసులో రాయ్‌ను జైలుకు పంపింది.