గురువారం 09 జూలై 2020
National - Jun 27, 2020 , 15:04:04

విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

కలబురిగి : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కర్నాటకలో సెంకడరీ స్కూల్‌ లీవింగ్‌ సర్టిఫికెట్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌సీ) బోర్డు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అధికారులు కలబురిగిలో శనివారం థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. పరీక్ష కేంద్రం వెలుపల స్క్రీనింగ్ కోసం విద్యార్థులు బారులు తీరారు. అలాగే షిమోగా(శివమొగ్గ)లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు. నిబంధనలు పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

కాగా, నేటి పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ముఖానికి మాస్కులు ధరించేలా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద మోహరించారు. భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. భౌతికదూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామని హుబ్లీ - ధార్వాడ్ పోలీస్ కమిషనర్ దిలీప్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, కర్ణాటకలో 11,005 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3909 మంది చికిత్స పొందుతుండగా, 6916 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 180 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.


logo