బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 15:51:00

ముంబై వలస కూలీల కోసం సింగపూర్‌లో సైక్లింగ్‌

ముంబై వలస కూలీల కోసం సింగపూర్‌లో సైక్లింగ్‌

పులావ్‌ ఉజోంగ్‌: కరోనా వైరస్‌ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన వలసకూలీలకు సహాయం చేసేందుకు ఇద్దరు చైనా సంతతి విద్యార్థులు సింగపూర్‌లో సైకిల్‌ యాత్ర చేపట్టారు. శనివారం నుంచి ఆదివారం వరకు దాదాపు 100 కిలోమీటర్ల మేర సైకిల్‌ సవారీ చేశారు. వీరిలో ఒకరు కెనడాకు చెందిన వ్యక్తి కాగా.. మరొకరు స్పానిష్‌ విద్యార్థి. వీరిద్దరూ చైనా సంతతికి చెందినవారే. ఆదివారం సాయంత్రం  కల్లా  దాదాపు 1,700 సింగపూర్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 90 వేల రూపాయలు) కలెక్ట్‌ చేశారు. మరో నాలుగురోజులు ఇలాగే సైకిల్‌ యాత్ర చేపట్టి మొత్తం ఏడు వేల సింగపూర్‌ డాలర్లు (ఇండియన్‌ కరెన్సీలో రూ.3.74 లక్షలు) వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ మొత్తాన్ని ముంబైలోని వలసకార్మికుల సంక్షేమం కోసం  వెచ్చిస్తామని వారు చెప్తున్నారు.


logo