శుక్రవారం 05 జూన్ 2020
National - May 17, 2020 , 10:44:33

బ‌ల‌మైన ఈదురు గాలులు.. ప‌లు ఇండ్లు ధ్వంసం

బ‌ల‌మైన ఈదురు గాలులు.. ప‌లు ఇండ్లు ధ్వంసం

రాయ్‌పూర్‌: చ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దోర్న‌పాల్ ఏరియాలో బ‌ల‌మైన ఈదురు గాలులు బీభ‌త్సం సృష్టించాయి. శ‌నివారం రాత్రి ఈదురు గాలులు సృష్టించిన బీభ‌త్సానికి తీవ్ర న‌ష్టం వాటిల్లింది. ప‌లు ఇండ్ల పైక‌ప్పులు ఎగిరిపోయాయి. ప‌శువుల పాక‌లు, మేక‌ల దొడ్లు గాలికి కొట్టుకుపోయాయి. వృక్షాలు నేల‌కూలాయి. ఈ ఘ‌ట‌న‌ల్లో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. వంద‌ల మంది ఆవాసాలు కోల్పోయి నిరాశ్ర‌యులుగా మిగిలారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించామ‌ని, నిరాశ్ర‌యుల కోసం తాత్కాలికంగా పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. ఈ ఈదురుగాలులవ‌ల్ల న‌ష్ట‌పోయిన వారికి ప‌రిహారం అందించ‌డం కోసం స‌ర్వే నిర్వ‌స్తున్నామ‌ని చెప్పారు. logo