ఆదివారం 05 జూలై 2020
National - Jun 19, 2020 , 11:53:03

చెన్నైలో పటిష్టంగా లాక్‌డౌన్‌

చెన్నైలో పటిష్టంగా లాక్‌డౌన్‌

చెన్నై : కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. చెన్నైలో కూడా లాక్‌డౌన్‌ ఉండడంతో ప్రభుత్వం 288 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు చేపడుతోంది. జనం గుంపులుగా తిరుగకుండా, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికొచ్చే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.  శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథన్‌ డ్రోన్ల ద్వారా లాక్‌డౌన్‌ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నై నగరంలోని చాలా ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జనం గుంపులుగా తిరుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో డ్రోన్లు తమకు ఎంతో సాయపడుతున్నాయన్నారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 


logo