ఆదివారం 07 జూన్ 2020
National - Apr 03, 2020 , 11:25:27

కరోనాపై ఇష్టానుసారం ప్రచారం చేస్తే శిక్షలు తప్పవు : గౌతమ్‌ సవాంగ్‌

కరోనాపై ఇష్టానుసారం ప్రచారం చేస్తే శిక్షలు తప్పవు : గౌతమ్‌ సవాంగ్‌

అమరావతి : కరోనా వైరస్‌పై అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తే కఠిన శిక్షలు తప్పవని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రసార సాధనం అధికారిక ఉత్తర్వులు లేనిదే వార్తలు ప్రసారం చేయకూడదన్నారు. కోవిడ్‌-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మహమ్మారిగా ప్రకటించిందన్నారు. తప్పు వార్తలు ప్రచారం చేస్తే సదరు వ్యక్తికి ఏడాది జైలు, జరిమానా విధించబడుతుందన్నారు. కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌-1995 చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo