మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 19:15:56

విల్లియనూరు ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటాం : సీఎం నారాయణస్వామి

విల్లియనూరు ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటాం : సీఎం నారాయణస్వామి

పాండిచ్చేరి : పుదుచ్చేరి రాష్ట్రం విల్లియనూరులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ విగ్రహం చుట్టూ గురువారం గుర్తు తెలియని వ్యక్తులు కాషాయం కండువా కప్పారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి తెలిపారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించబోమని శాసనసభలో నారాయణస్వామి పేర్కొన్నారు. ఎంజీ రామచంద్రన్ విగ్రహం చుట్టూ కాషాయ కండువా కప్పిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం తమిళనాడులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విగ్రహానికి శాలువా కప్పి పూలమాల వేశారు.


logo