బుధవారం 03 జూన్ 2020
National - Apr 09, 2020 , 01:07:42

అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు

అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసరాలను ఎక్కువ ధరకు అమ్మడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. కొందరు లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకొని నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రయత్నించినా, ఎక్కువ ధరలకు అమ్మినా అస్సలు ఉపేక్షించవద్దని సూచించింది. వెంటనే ‘అత్యవసర సరుకుల చట్టం-1955’ను ప్రయోగించి ప్రజలకు సరసమైనధరల్లో సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరి ంది. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అలాంటి వారికి ఏడేండ్లు జైలుశిక్ష లేదా జరిమానా విధించే అవకాశముందని వ్యాపారులను కేంద్రం హెచ్చరించింది.

నేరుగా కొనేందుకు అనుమతించండి 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా హోల్‌సేల్‌ వ్యాపారులు, బడా రిటైల్‌ సంస్థలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. వచ్చే మూడు నెలలపాటు వారు నేరుగా రైతులు, కో-ఆపరేటివ్‌ సంఘాలు, రైతు సంఘాలు, మండీల వద్ద నేరుగా ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించాలని పేర్కొన్నది. ఈ-నామ్‌ ద్వారా సేకరించే ఉత్పత్తులను నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు గోదాములను గుర్తించాలని సూచించింది. పంట సీజన్‌ మొదలైనందున రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలను తక్షణం చేపట్టాలని సూచించారు. తద్వారా వారు ఉత్పత్తులను సులభంగా అమ్ముకోగలుగుతారని చెప్పారు.  


logo