మంగళవారం 14 జూలై 2020
National - Jun 24, 2020 , 16:16:33

రోగుల‌ను చేర్చుకోక‌పోతే ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు

రోగుల‌ను చేర్చుకోక‌పోతే ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు

కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌.. ఆ రాష్ర్టంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌ను హెచ్చ‌రించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో రోగుల‌ను చేర్చుకోక‌పోతే.. అలాంటి ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తేల్చిచెప్పింది. 

ఒక వేళ ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు రోగుల‌ను చేర్చుకునేందుకు నిరాక‌రిస్తే.. లైసెన్సులు ర‌ద్దు చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.  ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు.. చాలా సంద‌ర్భాల్లో రోగుల‌ను చేర్చుకోలేదు. వారి వైఖ‌రి కార‌ణంగా రోగులు చాలా బాధ‌లు ఎదుర్కొవాల్సి వ‌చ్చింద‌ని ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ తమ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.  ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఎమ‌ర్జెన్సీ రోగుల‌ను చేర్చుకోక‌పోతే.. వారిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది. ఈ ఉత్త‌ర్వుల‌ను అన్ని ఆస్ప‌త్రుల మెడిక‌ల్ సూప‌రింటెండెంట్లు అమ‌లు చేయాల‌ని ఆదేశించింది. కొంత‌మంది రోగుల‌కు సేవ‌లందించ‌కుండా.. ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాలు తిర‌స్క‌రించిన నేప‌థ్యంలో ఈ ఉత్త‌ర్వులు జారీ చేయ‌బ‌డ్డాయ‌ని ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ స్ప‌ష్టం చేసింది.  


logo