ఆదివారం 07 జూన్ 2020
National - Apr 06, 2020 , 11:04:53

లాక్ డౌన్ ఎఫెక్ట్..ఎడారిని త‌ల‌పిస్తున్న రోడ్లు

లాక్ డౌన్ ఎఫెక్ట్..ఎడారిని త‌ల‌పిస్తున్న రోడ్లు

భోపాల్‌: క‌రోనా మ‌హమ్మారిని త‌రిమికొట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తోన్న లాక్ డౌన్ విజ‌యవంతంగా కొన‌సాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఇండ్ల లో నుంచి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భోపాల్ లో మెడిక‌ల్ షాపులు, డైరీ ఉత్ప‌త్తులు మిన‌హా అన్ని స‌ముదాయాలను త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలువ‌డే వ‌ర‌కు మూసివేయాల‌ని ఆదివారం జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు.

ఈ నేప‌థ్య‌లో భోపాల్ వీధుల్లో ఒక్క‌రు క‌నిపించ‌క‌పోవ‌డంతో...వీధులు, ప్ర‌ధాన ర‌హ‌దారులు ఎడారిని త‌లపిస్తున్నాయి. మ‌రోవైపు పోలీసులు, అధికార యంత్రాంగం నిర్ణీత స‌మ‌య‌పాల‌న పాటిస్తూ..ఎప్ప‌టిక‌పుడు పెట్రోలింగ్ నిర్వ‌హిస్తూ క‌రోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేస్తున్నారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo