ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 22, 2020 , 12:32:23

అహ్మ‌దాబాద్‌లో క‌ర్ఫ్యూ ఎఫెక్ట్‌.. రోడ్ల‌న్నీ నిర్మానుష్యం

అహ్మ‌దాబాద్‌లో క‌ర్ఫ్యూ ఎఫెక్ట్‌.. రోడ్ల‌న్నీ నిర్మానుష్యం

అహ్మ‌దాబాద్‌: దేశంలోని ఉత్త‌రాది రాష్ట్రాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ది. దీంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ త‌దిత‌ర రాష్ట్రాలు మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించ‌క‌పోయినా క‌రోనా క‌ట్ట‌డి కొన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. పాక్షికంగానో, సంపూర్ణంగానో క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్, గుజ‌రాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో నైట్ క‌ర్ఫ్యూను అమ‌ల్లోకి తీసుకొచ్చారు. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో మాత్రం మూడ‌ రోజుల‌పాటు సంపూర్ణ క‌ర్ఫ్యూ విధించారు. 

అహ్మ‌దాబాద్‌లో న‌వంబ‌ర్ 20న‌ (శుక్ర‌వారం) రాత్రి 9 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి వ‌చ్చింది. న‌వంబ‌ర్ 23న (సోమ‌వారం) ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు ఈ క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నున్న‌ది. క‌ర్ఫ్యూ కార‌ణంగా అహ్మ‌దాబాద్ న‌గ‌రంలోని వీధుల‌న్నీ ఎడారుల‌ను త‌ల‌పిస్తున్నాయి. రోడ్లపై గ‌స్తీ నిర్వ‌హిస్తున్న పోలీసులు త‌ప్ప అంతా నిర్మానుష్యంగా ఉన్న‌ది.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.