శుక్రవారం 05 జూన్ 2020
National - May 24, 2020 , 11:59:29

రంజాన్‌ తోఫాతో సొంతూరికి 30 మంది విద్యార్థులు

రంజాన్‌ తోఫాతో సొంతూరికి 30 మంది విద్యార్థులు

న్యూఢిల్లీ: లాక్‌డన్‌తో మదర్సాలో చిక్కుకుపోయిన ముప్పై మంది విద్యార్థులను రంజాన్‌ ముందురోజు ఢిల్లీ పోలీసులు వారి స్వస్థలానికి పంపించారు. దేశరాజధానిలోని కైలాశ్‌లో ఉన్న మసీద్‌ మదర్సా తలిముల్‌ క్వారన్‌లో బీహార్‌కు చెందిన 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మార్చి 25న అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌తో వారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు కొంతమంది ఎన్జీవోలు, లాయర్ల సహకారంతో రంజాన్‌ బహుమతిగా వారిని బీహార్‌లోని కతిహర్‌కు ప్రత్యేక బస్సుల్లో పంపించారు. ఈ సందర్భంగా వారికి కరోనా కిట్‌తోపాటు, నిత్యావసరాలు, కొత్త బట్టలు, ఆహార పదార్థాలను అందిచారు.


logo