ఆదివారం 05 జూలై 2020
National - Jun 26, 2020 , 12:30:49

క‌రోనా పాజిటివ్ శ్యాంపిళ్ల‌ను 30 రోజులు దాచిపెట్టండి..

క‌రోనా పాజిటివ్ శ్యాంపిళ్ల‌ను 30 రోజులు దాచిపెట్టండి..

హైద‌రాబాద్: కోవిడ్‌19 ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలిన శ్యాంపిళ్ల‌ను 30 రోజుల పాటు భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని ఆయా ప్ర‌భుత్వ ల్యాబ‌రేట‌రీల‌కు ఐసీఎంఆర్ సూచ‌న‌లు చేసింది.  దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ ప‌రిశోధ‌న‌శాలల్లో.. కోవిడ్‌19 ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. అయితే పాజిటివ్‌గా తేలిన శ్యాంపిళ్ల‌ను ధ్వంసం చేయ‌డానికి ముందు.. క‌నీసం 30 రోజుల పాటు భ‌ద్రంగా ఉంచాల‌ని ఐసీఎంఆర్ త‌న తాజా సూచ‌న‌ల్లో ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌టీ-పీసీఆర్ ప‌ద్ధ‌తి ప‌రీక్ష కోసం సేక‌రించిన కోవిడ్‌19 శ్యాంపిళ్ల‌ను తాము ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కార‌మే భ‌ద్ర‌ప‌రుచాల‌ని ఐసీఎంఆర్ వెల్ల‌డించింది. అన్ని శ్యాంపిళ్ల‌ను ధ్వంసం చేయ‌డానికి పూర్వం.. డిస్ఇన్‌ఫెక్ష‌న్ ప‌ద్ధ‌తుల‌ను స‌క్ర‌మంగా పాటించాల‌ని ఐసీఎంఆర్ చెప్పింది. పాజిటివ్ శ్యాంపిళ్ల ధ్వంసానికి చెందిన రికార్డును కూడా మెయిన్‌టేన్ చేయాల‌న్న‌ది. 

సుదీర్ఘ‌కాలం పాటు శ్యాంపిళ్ల‌ను భ‌ద్ర‌ప‌రుచాల‌నుకుంటే.. వాటికి స్ప‌ష్ట‌మైన లేబిలింగ్ ఉండాల‌ని ఐసీఎంఆర్ సూచించింది. శ్యాంపిల్ సేక‌రించిన తేదీ వాటిపై ఉండాల‌న్న‌ది. ఆ పాజిటివ్ శ్యాంపిళ్ల‌ను మైన‌స్ 80 డిగ్రీల వ‌ద్ద డీప్ ఫ్రీజ‌ర్‌లో ఉంచాల‌ని త‌న మార్గ‌ద‌ర్శ‌కాల్లో ఐసీఎంఆర్ ప్ర‌భుత్వ ల్యాబ్‌ల‌కు సూచించింది.  స్టోరేజీ శ్యాంపిళ్ల‌కు చెందిన ఇన్వెంట‌రీ మెయిన్‌టేన్ చేయాల‌ని పేర్కొన్న‌ది.

 


logo