శుక్రవారం 10 జూలై 2020
National - Jun 28, 2020 , 18:51:50

కరోనా కాలర్‌ ట్యూన్‌ను నిలిపివేయండి : మాజీ మంత్రి భరత్‌సింగ్‌

కరోనా కాలర్‌ ట్యూన్‌ను నిలిపివేయండి : మాజీ మంత్రి భరత్‌సింగ్‌

ముంబై : ప్రజలకు అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం కరోనా కాలర్‌ ట్యూన్‌ పెట్టగా దానిపై కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్‌లలో కరోనా వైరస్‌ కాలర్‌ ట్యూన్‌ను నిలిపివేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భరత్‌సింగ్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ట్యూన్‌ మార్చిలో ప్రారంభం అయి జూన్‌ వరకు చెవుల్లో మార్మోగుతూనే ఉందని, దీన్ని ఎవరు వినాలి, ఎవరు అర్థం చేసుకోవాలి అని భరత్‌సింగ్‌ అన్నారు. దీన్ని కొనసాగించవద్దు.. ట్యూన్‌ చెవులను పట్టేసుకుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 

భరత్‌ సింగ్‌ రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో బలమైన నేత. ఇదివరకు కూడా ఈయన చాలా విషయాల్లో ప్రభుత్వాలకు లేఖలు రాశారు. తాజాగా ఆయన లాక్‌డౌన్‌ కాలంలో మద్యాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. logo