ఆదివారం 17 జనవరి 2021
National - Nov 24, 2020 , 19:23:51

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

 భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 445.87 పాయింట్లు అంటే 1.01శాతం లాభపడి 44,523.02 వద్ద, నిఫ్టీ 128.70 పాయింట్లు 1.00శాతం ఎగిసి 13,055.20 పాయింట్ల వద్ద ముగిసింది. 1603 షేర్లు లాభాల్లో, 1167 నష్టాల్లోక్లోజ్ అయ్యాయి. 175 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ 44,523 పాయింట్లతో సరికొత్త శిఖరాలను తాకింది. నిఫ్టీ కూడా నేడు మొదటిసారి 13 వేల మార్క్‌ను క్రాస్ చేసింది. నిఫ్టీ బ్యాంకు సూచీ 2 శాతం లాభపడగా, ఆటో, మెటల్, ఫార్మా సూచీలు ఒక శాతం చొప్పున పెరిగాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 4.56 శాతం, యాక్సిస్ బ్యాంకు 4.04 శాతం, ఐచర్ మోటార్స్ 3.69 శాతం, హిండాల్కో 3.65 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 3.39 శాతం, లాభాల్లో ముగిశాయి. టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 1.52 శాతం, హెచ్డీ ఎఫ్సీ 1.47 శాతం, బీపీసీఎల్1.19 శాతం, శ్రీ సిమెంట్స్ 0.91 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.63 శాతం నష్టాల్లో ముగిశాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు ఉన్నాయి. రిలయన్స్ స్టాక్ 1 శాతం లాభపడి రూ.1971 వద్ద క్లోజ్ అయింది. అయినప్పటికీ రూ.2,000కు దిగువనే ఉంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.