సోమవారం 06 జూలై 2020
National - Jun 02, 2020 , 21:21:47

రెండు రోజులు ఇండ్లలోనే ఉండండి: మహారాష్ట్ర సీఎం

రెండు రోజులు ఇండ్లలోనే ఉండండి: మహారాష్ట్ర సీఎం

ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా మారి తీరం వైపు దూసుకొస్తుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తుఫానుకు ఐఎండీ అధికారులు నిసర్గ అని పేరుపెట్టారు. బుధవారం రాత్రికల్లా నిసర్గ తుఫాను మహారాష్ట్రలోని హరిహరేశ్వర్ లోని తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసిన నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేశారు. 

రానున్న 2 రోజులు ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిసర్గ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయన్నారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు పశ్చిమ తీరం వెంబడి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని ప్రధాని మోదీ తెలిపారు. logo