బుధవారం 03 జూన్ 2020
National - Apr 03, 2020 , 13:30:16

ఇళ్లే సురక్షితం.. గూగుల్‌ డూడుల్‌

ఇళ్లే సురక్షితం.. గూగుల్‌ డూడుల్‌

హైదరాబాద్‌: ‘ఇంట్లోనే ఉండండి, ప్రాణాలు రక్షించుకోండి’ అనే సందేశమిస్తూ ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ తన డూడుల్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 10లక్షల మంది కరోనా బారిన పడగా, 53వేల మంది మరణించారు. దీంతో చాలా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజలను ఇండ్లలోనే ఉండి ప్రాణాలను సురక్షితంగా ఉంచుకోవాలని సూచించాయి. దీనికి గుర్తుగా గూగుల్‌ సంస్థ శుక్రవారం ఈ ప్రత్యేక డూడుల్‌ రూపొందించింది. డూడుల్‌లో ఉన్న అక్షరాలు ఇంట్లోనే ఉండి పుస్తకాలు చదువుకోండి, సంగీత వాయిద్యాలను వాయించడం, ఆడుకోవడం, జిమ్‌ వర్కౌట్స్‌, ఫోన్లు చేయడం వంటి పనులు చేసుకోవాలని సూచించేవిగా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 2,224 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 53 మంది మరణించారు. 


logo