శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 07:07:52

తమిళనాడులో పెరియార్‌ విగ్రహానికి కాషాయ రంగు..

తమిళనాడులో పెరియార్‌ విగ్రహానికి కాషాయ రంగు..

తిరుచిరాపల్లి : తమిళనాడులోని తిరుచిరాపల్లిలో కొందరు దుండగులు సంఘసంస్కర్త ఈవీ రామస్వామి ‘పెరియార్‌' విగ్రహాన్ని ధ్వంసంచేసి దానికి కాషాయ రంగు పులిమారు. దీనిపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ మండిపడ్డాయి. తిరుచిరాపల్లి నగరంలోని ఇనాంకులథూర్‌ ప్రాంతం సమంతువపురం కాలనీలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఘటనకు నిరసనగా దిండిగల్ హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్‌కు భారీగా నిలిచిపోయింది. పోలీసులు కలగజేసుకొని వారికి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. ఉపముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు. కారకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo