ఆదివారం 29 మార్చి 2020
National - Mar 09, 2020 , 12:44:31

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర విప్‌ గొంగిడి సునీత..

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర విప్‌ గొంగిడి సునీత..

తిరుమల: తెలంగాణ రాష్ట్ర విప్‌ గొంగిడి సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆమె.. తన భర్తతో కలిసి స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో వేంకటేశ్వరుడిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన సునీత దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం, స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం, ఆలయ రంగనాయకుల మండపంలో సునీత దంపతులకు.. వేదపండితులు ఆశీర్వచనం అందిచగా.. అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, పట్టువస్ర్తాలు అందజేశారు. ఈ సందర్భంగా విప్‌ గొంగిడి సునీత మాట్లాడుతూ.. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. 


logo