సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 17:41:35

‘పటాకుల నిషేధంపై పునఃసమీక్షించాలి’

‘పటాకుల నిషేధంపై పునఃసమీక్షించాలి’

చెన్నై : పటాకుల నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసమీక్షించాలని పటాకుల విక్రేతల సంఘం తమిళనాడు అధ్యక్షుడు గణేషన్‌ కోరారు. శనివారం చెన్నైలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది తాము పర్యావరణహిత పటాకులు తయారు చేసినట్లు తెలిపారు. పటాకుల అమ్మకం, వాడకంపై ప్రభుత్వాలు నిషేధం విధించడం సరికాదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలతో పటాకుల పరిశ్రమపై ఆధారపడి జీవించే వారు రోడ్డున పడే ప్రమాదముందని పేర్కొన్నారు.

పటాకులపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆయన కోరారు. పర్యావరణ కాలుష్యం, కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ దీపావళికి పటాకులపై నిషేధం విధించాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలు ఏకంగా ఓ అడుగు ముందుకేసి పటాకులు కాల్చిన వారికి జరిమానా సైతం విధించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.