శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Feb 01, 2021 , 15:08:20

స్టార్ట‌ప్‌ల‌కు మ‌రో ఏడాది ట్యాక్స్ హాలిడే

స్టార్ట‌ప్‌ల‌కు మ‌రో ఏడాది ట్యాక్స్ హాలిడే

న్యూఢిల్లీ: ‌క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా ఆటుపోట్లు చవిచూసిన స్టార్టప్‌లకు చేయూతను ఇవ్వ‌డం కోసం ప్రభుత్వం మ‌రో ఏడాదిపాటు ట్యాక్స్‌ హాలిడే ప్రకటించింది. 2022, మార్చి 31 వరకు స్టార్ట‌ప్‌ల‌కు ట్యాక్స్ హాలిడేను పొడిగిస్తున్నట్టు బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదేవిధంగా స్టార్టప్‌లకు ఇచ్చే క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపులను కూడా మరో ఏడాది పొడిగించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. 

అదేవిధంగా కంపెనీల చట్టం 2013 ప్ర‌కారం చిన్న కంపెనీల నిర్వచనంలో మార్పు చేస్తున్నామని ఆర్థికమంత్రి నిర్మ‌ల తెలిపారు. రూ.2 కోట్ల వరకు పెయిడప్ క్యాపిటిల్, రూ.20 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు చిన్న కంపెనీల కిందకు వస్తాయని, అందువల్ల రెండు లక్షలకుపైగా కంపెనీలు లబ్ధి పొందుతాయని నిర్మలా సీతారామన్ వెల్ల‌డించారు. కాగా, స్టార్టప్‌ల విషయంలో బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదననలపై ఉడెన్ స్ట్రీట్ సీఈవో లోకేంద్ర రణావత్ సంతృప్తి వ్యక్తంచేశారు. పెట్టుబడులపై ఏడాది పాటు పన్ను మినహాయింపు ఇవ్వ‌డం దేశంలో మరిన్ని స్టార్టప్‌ల వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo