గురువారం 02 జూలై 2020
National - Jul 01, 2020 , 01:42:56

సెక్యూరిటీస్‌ లావాదేవీలపై ఇక దేశమంతా ఒకే స్టాంప్‌ డ్యూటీ

సెక్యూరిటీస్‌ లావాదేవీలపై ఇక దేశమంతా ఒకే స్టాంప్‌ డ్యూటీ

న్యూఢిల్లీ: షేర్లు, డిబెంచర్లు, ఇతర సెక్యూరిటీల లావాదేవీలపై బుధవారం నుంచి ఒకే రకమైన స్టాంప్‌ డ్యూటీని రాష్ర్టాలు వసూలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం స్పష్టం చేసింది. భారతీయ స్టాంప్‌ చట్టం, 1899 సవరణ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నిజానికి జనవరి నుంచే అమలు చేయాలని చూసినప్పటికీ, ఏప్రిల్‌ 1కి.. ఆ తర్వాత జూలై 1కి వాయిదా పడింది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సెక్యూరిటీస్‌ లావాదేవీలపై స్టాంప్‌ డ్యూటీలు పడుతున్నాయి. దీనివల్ల సెక్యూరిటీస్‌ మార్కెట్‌లో లావాదేవీల ఖర్చులు పెరిగిపోతున్నాయని కేంద్రం అంటున్నది. ఇది పెట్టుబడులను విఘాత పరుస్తున్నదని, సులభతర వ్యాపార నిర్వహణకూ అడ్డంకిగా మారుతున్నదని భావించింది. దీంతో గతేడాది చట్టంలో మార్పులు చేసింది. 


logo