ఆదివారం 24 జనవరి 2021
National - Jan 01, 2021 , 13:16:29

ఆ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: డీఎంకే

ఆ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: డీఎంకే

చెన్నై: వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో త‌మిళ‌నాడు అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో అధికార అన్నాడీఎంకే, ప్ర‌తిప‌క్ష డీఎంకే ఒక‌రిపై మ‌రొక‌రు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. డీఎంకే వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో అన్నాడీఎంకేను ప్ర‌ధానంగా టార్గెట్ చేస్తున్న‌ది. బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన అన్నాడీఎంకే వివాదాస్ప‌ద‌ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ఎలాంటి వైఖ‌రి వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో.. ఈ అంశాన్ని హైలెట్ చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో రైతుల ఓట్లు కొల్ల‌గొట్టాల‌ని డీఎంకే భావిస్తున్న‌ట్లుగా తెలుస్తున్న‌ది. 

అన్నాడీంఎకే, డీఎంకే మ‌ధ్య చోటుచేసుకుంటున్న తాజా ప‌రిణామాలను బ‌ట్టి చూస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తున్న‌ది. తాజాగా ఇవాళ కూడా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామికి లేఖ రాశారు. అసెంబ్లీ ప్ర‌త్యేక సెష‌న్‌ను ఏర్పాటు చేసి కేంద్రం తెచ్చిన‌ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా తీర్మానం చేయాల‌ని ఆ లేఖ‌లో డిమాండ్ చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo