బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 15:26:44

మై ప‌ప్పూ యాద‌వ్ అగానే కూలిన స్టేజ్‌..

మై ప‌ప్పూ యాద‌వ్ అగానే కూలిన స్టేజ్‌..

హైద‌రాబాద్‌: బీహార్ రెండ‌వ ద‌శ అసెంబ్లీ ఎన్నికల కోసం జోరుగా  ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. అయితే ఇవాళ జ‌న అధికార్ పార్టీ ఏర్పాటు చేసిన స‌భ‌లో అపశృతి చోటుచేసుకున్న‌ది.  మాజీ ఎంపీ ప‌ప్పూ యాద‌వ్ కోసం ఏర్పాటు చేసిన స‌భా వేదిక కుప్ప‌కూలింది.  పప్పూ యాద‌వ్ మాట్లాడుతున్న స‌మ‌యంలో వేదిక ఒక్క‌సారిగా నేల‌మ‌ట్టం అయ్యింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌ప్పూ యాద‌వ్ స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. స్టేజ్‌తో పాటు టెంట్ కూడా కూలింది. ముజాఫ‌ర్‌పూర్‌లోని మినాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.