బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 17:20:15

విధులకు హాజరు‌కాని ఉద్యోగులు రిటైర్ కావాల్సిందే..

విధులకు హాజరు‌కాని ఉద్యోగులు రిటైర్ కావాల్సిందే..

డెహ్రాడూన్: విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులు ఇక రిటైర్ కావాల్సిందేనని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత ఉద్యోగుల జాబితా తయారీ కోసం పలు శాఖలకు నోటీసులు పంపింది. దీని కోసం ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మే నెలలో ఒక సమావేశం జరిగింది. 50 ఏండ్లు పైబడిన ఉద్యోగులు, పలు కారణాలతో సుదీర్ఘ కాలం సెలవుల్లో ఉన్నవారు తప్పని సరిగా పదవీ విరమణ చేయాల్సిందేనని ఈ సందర్భంగా నిర్ణయించారు. అలాంటి ఉద్యోగుల జాబితాను తయారు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ రాష్ట్ర అదనపు కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. గత 40 ఏండ్లుగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రక్రియేనని ఆయన చెప్పారు. ప్రతి ఏటా జూన్, జూలై నెలలో ఈ మేరకు అన్ని శాఖలకు నోటీసులు జారీ చేయడం సాధారణమేనని ఆయన వివరించారు. తప్పనిసరిగా రిటైర్‌మెంట్ కోరే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందన్నారు.



logo