మంగళవారం 14 జూలై 2020
National - Jun 24, 2020 , 15:05:18

రేప‌టి నుంచి SSLC ప‌రీక్ష‌లు: క‌ర్ణాట‌క‌

రేప‌టి నుంచి SSLC ప‌రీక్ష‌లు: క‌ర్ణాట‌క‌

బెంగ‌ళూరు: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల‌న్నీ స్తంభించిపోయాయి. వివిధ రాష్ట్రాల్లో 10 త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ ప‌రీక్ష‌లు సైతం ర‌ద్ద‌య్యాయి. మ‌రికొన్ని రాష్ట్రాలు కూడా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దుచేసే యోచ‌న‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మాత్రం అందుకు భిన్నంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. SSLC ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. క‌రోనా విస్తృతి నేప‌థ్యంలో విద్యార్థుల‌కు ఎలాంటి ముప్పు వాటిల్ల‌కుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి స‌మాయ‌త్త‌మైంది. 

రాష్ట్రంలో గురువారం (జూన్ 25) నుంచి SSLC ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని క‌ర్ణాట‌క ఆరోగ్య‌శాఖ మంత్రి బీ శ్రీరాములు తెలిపారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింద‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 8,48,203 మంది SSLC ప‌రీక్ష‌లు రాయ‌నున్న‌ట్లు ఆరోగ్య‌మంత్రి వెల్ల‌డించారు. ప‌రీక్ష‌లకు హాజ‌ర‌య్యే విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా ముఖాల‌కు మాస్కులు ధ‌రించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు.    


  


logo