శనివారం 04 జూలై 2020
National - Jun 27, 2020 , 15:50:54

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు.. విద్యార్థులకు ధర్మల్‌ స్క్రీనింగ్‌

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు.. విద్యార్థులకు ధర్మల్‌ స్క్రీనింగ్‌

కలబుర్గి : కర్ణాటక రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సెకండరీ స్కూల్‌ లెవల్‌ సర్టిఫికెట్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌సీ) పరీక్షలు రావడంతో నిర్వహణకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులకు వెలుపలే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. కలబుర్గిలోని పలు పరీక్ష  కేంద్రాలను ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామని హుబ్లీ-దర్వాడ్‌ పోలీస్‌ కమిషనర్‌  ఆర్‌ దిలీప్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11,005 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీటిలో 3909 యాక్టివ్‌ కేసులుండగా 6916మంది దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 181మంది మృతి చెందారు.


logo