బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 01:22:46

స్టాఫ్‌ సెలక్షన్‌ పరీక్షలు వాయిదా!

స్టాఫ్‌ సెలక్షన్‌ పరీక్షలు వాయిదా!

న్యూఢిల్లీ: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ (ఎస్సెస్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన నియామక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ (10+2) లెవెల్‌ పరీక్ష (టైర్‌-1), జూనియర్‌ ఇంజినీర్‌ పరీక్ష (పేపర్‌-1) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఎస్సెస్సీ తెలిపింది. ఈ పరీక్షలకు తాజా షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామన్నది. అభ్యర్థులు తాజా సమాచారం కోసం నిరంతరం కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. 


logo