మంగళవారం 31 మార్చి 2020
National - Mar 21, 2020 , 13:32:36

కరోనా ఎఫెక్ట్‌.. ఉచితంగా శ్రీవారి లడ్డూల పంపిణి

కరోనా ఎఫెక్ట్‌.. ఉచితంగా శ్రీవారి లడ్డూల పంపిణి


తిరుపతి : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనాన్ని నిలిపి వేసిన విషయం విదితమే. దీంతో ఇప్పటికే తయారు చేసిన 2 లక్షలకు పైగా లడ్డూలు మిగిలిపోయాయి. ఈ లడ్డూలు పాడైపోయే అవకాశం ఉన్నందున టీటీడీ ఉద్యోగులకు ఉగాది కానుకగా ఈ లడ్డూలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. టీటీడీలో పని చేసే ఒక్కో ఉద్యోగికి ఉచితంగా 10 లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు కూడా లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. 

ఈ నెల 19వ తేదీ సాయంత్రం నుంచి తిరుమలకు భక్తులను అనుమతించడం లేదు. కొండ పైనున్న భక్తుల దర్శనం ముగిసిన తర్వాత అందరిని కిందకు పంపించారు. 19వ తేదీ రోజే కింద నుంచి పైకి వాహనాలను అనుమతించలేదు. కేవలం భక్తులకు దర్శనాలు మాత్రమే నిలిపివేస్తున్నామని, ఆలయం తెరిచి ఉంటుందని అర్చకులు స్పష్టం చేశారు. 

తిరుమల కొండపైకి భక్తులను, వాహనాలను అనుమతించకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. రోజుకు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే కొండ.. బోసిపోయింది. గోవిందా గోవిందా నామస్మరణలతో మార్మోగే ఏడు కొండలు నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్లాయి. కేవలం అర్చకులు, ఉద్యోగులు మాత్రమే కొండపై ఉన్నారు. శ్రీవారి సేవలో అర్చకులు మాత్రమే పాల్గొంటున్నారు. 


logo
>>>>>>