సోమవారం 01 జూన్ 2020
National - May 19, 2020 , 20:32:24

భక్తుల దర్శనాలకు సిద్ధమైన శ్రీశైలం

భక్తుల దర్శనాలకు సిద్ధమైన శ్రీశైలం

శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనభాగ్యం కలిగించనున్నారు. ప్రభుత్వ నియమాల ప్రకారం భౌతిక దూరం తప్పక పాటించేలా క్యూలైన్లలో వృత్తాలను గీసి ఉంచారు. ప్రధానంగా కల్యాణ కట్టలో తల నీలాలు సమర్పించే భక్తుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్‌ తర్వాతే భక్తులకు అనుమతి ఉంటుందని, గన్‌ ధర్మామీటర్‌తో పరీక్షించి శానిటైజర్‌, మాసుస్క్‌లు ధరించిన తరువాతే ఆలయ ప్రవేశం ఉంటుందని ఈవో కేఎస్‌ రామారావు స్పష్టం చేశారు. 


logo