సోమవారం 18 జనవరి 2021
National - Jan 12, 2021 , 16:06:52

శ్రీపాద‌నాయ‌క్‌కు ప్రాణాపాయం లేదు: రాజ్‌నాథ్ సింగ్

శ్రీపాద‌నాయ‌క్‌కు ప్రాణాపాయం లేదు: రాజ్‌నాథ్ సింగ్

ప‌నాజీ: ‌రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి గోవాలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ శ్రీపాద నాయ‌క్‌కు ప్ర‌స్తుతం ప్రాణాపాయం ఏమీ లేద‌ని ర‌క్ష‌ణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. గ‌త రాత్రి ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే తాను గోవా ముఖ్య‌మంత్రికి ఫోన్‌చేసి వివ‌రాలు తెలుసుకున్నాన‌ని, ప్ర‌ధాని మోదీ కూడా గోవా సీఎంతో మాట్లాడార‌ని వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత పీఎం త‌న‌కు కూడా ఫోన్‌చేసి ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తప‌ర్చార‌ని, అదేవిధంగా గోవాకు వెళ్లి ప‌రిస్థితిని స‌మీక్షించ‌మ‌ని త‌న‌కు సూచించార‌ని రాజ్‌నాథ్ చెప్పారు. 

ప్ర‌ధాని సూచ‌న మేర‌కు గోవాకు వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్‌.. రాశ్రీపాద‌నాయ‌క్ ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని, ఆయ‌నకు ప్ర‌స్తుతం ప్రాణాపాయం ఏమీలేద‌ని వైద్యులు చెప్పార‌ని వెల్ల‌డించారు. శ్రీపాద‌నాయ‌క్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుల‌తో ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ఎప్పటిక‌ప్పుడు సంప్ర‌తింపులు జ‌రుపుతున్నార‌ని, ఎయిమ్స్ నుంచి ఒక వైద్య బృందం కూడా గోవాకు రానుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇంకా అవ‌స‌ర‌మైతే శ్రీపాద‌నాయ‌క్‌నే ఢిల్లీలోని ఎయిమ్స్ త‌ర‌లించి చికిత్సి చేయిస్తామ‌ని చెప్పారు.         ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.