బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 00:46:44

ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు కుట్ర!

ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు కుట్ర!
  • ఐఎస్‌తో సంబంధాలున్న కశ్మీర్‌ జంట అరెస్ట్‌

న్యూఢిల్లీ: ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న కశ్మీర్‌ జంటను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. వారిని జహన్‌జేబ్‌ షమీ, హీనా బషీర్‌ బేగ్‌గా గుర్తించారు. జామియానగర్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరు ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు కుట్రపన్నినట్లు చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు ముస్లిం యువతను ప్రేరేపిస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరూ ‘ఇండియన్‌ ముస్లిం యునైట్‌' పేరుతో సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌ నిర్వహిస్తున్నారని అన్నారు. 


సీఏఏ, జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారని వెల్లడించారు. ఈ జంటకు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ విభాగంతోనూ సంబంధాలున్నట్లు చెప్పారు. సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనల్లో ఐఎస్‌ కీలకపాత్ర  పోషిస్తున్నట్టు తెలిపారు. సీఏఏ వ్యతిరేక నిరసనల వెనుక ఐఎస్‌ హస్తం ఉన్నదని కేంద్రం పదే పదే ఆరో పిస్తున్న సంగతి తెలిసిందే. 


logo