గురువారం 04 జూన్ 2020
National - Apr 04, 2020 , 20:01:03

శ్రీ సత్యసాయి ట్రస్ట్‌ భారీ విరాళం

శ్రీ సత్యసాయి  ట్రస్ట్‌ భారీ విరాళం

అమరావతి: కరోనా మహమ్మారిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సహాయం చేసేందుకు శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు సైతం ముందుకొచ్చింది. ఏపీ సీఎం సహాయ నిధికి రూ.5కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఇవాళ సత్యసాయి ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి రూ.5కోట్ల చెక్కును అందజేశారు.  ఈ మొత్తాన్ని కరోనా నియంత్రణ చర్యల కోసం వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.  


logo