శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 21:46:00

తిరుమల చేరుకున్న శ్రీలంక ప్రధాని రాజపక్సే

తిరుమల చేరుకున్న శ్రీలంక ప్రధాని రాజపక్సే

తిరుమల: శ్రీవారి దర్శనార్ధం శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే తిరుమలకు చేరుకున్నారు.. అంతకు ముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి శాసనసభ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన ఆయన తిరుమలకు వచ్చారు.. తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ఆయనకి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.. ఇవాళ రాత్రి పద్మావతి అతితథి గృహంలో ఆయనకు బస ఏర్పాటు చేశారు.. శ్రీలంక ప్రధానితో పాటుగా ఆయన కుమారుడు యోషితా రాజ పక్సే, ఆదేశ మంత్రి ఆర్ముగం తొండమాన్ . అధికారులు తిరుమలకు చేరుకున్నారు.. రేపు ఉదయం తెల్లవారుజామున అష్టదళ పాద పద్మారాధన సేవ, వి.ఐ.పి బ్రేక్ లో  తిరుమల శ్రీవారిని శ్రీలంక ప్రధాని రాజ పక్సే దర్శించుకోనున్నారు.logo