శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 01:42:26

శ్రీలంకలో కర్ఫ్యూ

శ్రీలంకలో కర్ఫ్యూ

కొలంబో: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా శ్రీలంకలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స కార్యాలయం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావంతో 9 వేలమంది మృతిచెందిన నేపథ్యంలో ఈ మేరకు కఠినచర్యలకు ఉపక్రమించారు. ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి దేశంలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ఈ కర్ఫ్యూ విధించారు. దేశంలో 66 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, అందులో 25 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని శ్రీలంక కొవిడ్‌-19 జాతీయ నివారణ కేంద్రం వెల్లడించింది. 


logo