సోమవారం 06 జూలై 2020
National - Jun 14, 2020 , 18:19:56

తెరుచుకున్న‌ దుర్గాపరమేశ్వరీ ఆలయం

తెరుచుకున్న‌ దుర్గాపరమేశ్వరీ ఆలయం

మంగళూర్‌ : లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలపాటు భక్తుల దర్శనానికి నోచని కర్ణాటక రాష్ట్రం మంగళూర్‌ నగరంలోని ప్రసిద్ధ దుర్గా పరమేశ్వరీ ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆదివారం అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు నిర్వాహకులు ఆలయం పరిసరాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి అనుమతించారు. భౌతికదూరం పాటించేలా నేలపై గడులు గీసి క్యూలో దర్శనానికి పంపారు.

కరోనా నియంత్రణకు నిబంధనలను పటిష్ఠంగా అమలు చేస్తూ, భక్తులు ఆరోగ్య నియమాలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్రంలోని ఆలయాలను జూన్‌ 1నుంచి తెరుచుకోవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే.  కాగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలను ఆన్‌లైన్‌లో ప్రారంభిస్తామని, లాక్‌డౌన్‌ పూర్తయ్యేంత వరకు ఆలయాలను తెరువబోమని ఆలయ పుజారి కోట శ్రీనివాస్‌, రాష్ట్ర ముజ్‌రాయ్‌శాఖ మంత్రి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 


logo