బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 16:21:32

ఘనంగా ఏనుగు పుట్టినరోజు..!

ఘనంగా ఏనుగు పుట్టినరోజు..!

తిరువనంతపురం: అవును మీరు విన్నది నిజమే. పుట్టినరోజు మనుషులకే కాదు.. ఈ మధ్య జంతువులకు కూడా నిర్వహిస్తున్నారు. కేరళలోని పునరావాస కేంద్రం నిర్వాహకులు ఓ బుల్లి ఏనుగు మొదటి పుట్టినరోజును  ఘనంగా నిర్వహించారు. తల్లి,తండ్రి నుంచి దూరమైన ఏనుగును కంటికి రెప్పలా సంరక్షించడమే కాకుండా.. దాని పుట్టినరోజుకు వేడుకలు నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు.

అడవిలో అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల తన తల్లిదండ్రులనుంచి తప్పిపోయింది. కేరళలోని కప్పుకాడు ఏనుగు పునరావాస కేంద్రం నిర్వాహకులు నవంబర్‌ 8, 2019న దాన్ని కేంద్రానికి తీసుకువచ్చారు. దానికి నిర్వాహకులు శ్రీకుట్టి అని నామకరణం చేశారు. సోమవారం నాటికి ఏడాది కావడంతో కేంద్రం నిర్వాహకులు బర్త్‌డేపార్టీ ఏర్పాటు చేశారు. చెరకు, బెల్లం, ఫైనాపిల్స్‌తో కేక్‌ తయారు చేశారు.  ఈ బర్త్‌డే పార్టీకి అటవీ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సిన్హా కూడా హాజరయ్యారు. ఏనుగు తరఫున ఆయన కేక్ కట్ చేసి, సాంప్రదాయ శాలువా సమర్పించారు. పర్యాటకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని, బుల్లి ఏనుగుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.