శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 13:51:29

రాజ‌స్థాన్‌లో పాక్ గూఢ‌చారి అరెస్ట్‌

రాజ‌స్థాన్‌లో పాక్ గూఢ‌చారి అరెస్ట్‌

జైపూర్ : రాజ‌స్థాన్‌లో పాకిస్తాన్ గూఢ‌చారి అరెస్టు అయ్యాడు. గూఢ‌చారిని రాజ‌స్థాన్‌లోని బాడ్మేర్‌లో అదుపులోకి తీసుకున్న‌ట్లు సీబీ-సీఐడీ అధికారులు తెలిపారు. భార‌త సైన్యం స‌మాచారాన్ని పాకిస్తాన్‌కు చేర‌వేస్తున్న‌ట్లు గుర్తించారు. స‌రిహ‌ద్దుల్లో వేత‌న కార్మికుడిగా ప‌ని చేస్తూ గూఢ‌చ‌ర్యానికి నిందితుడు పాల్ప‌డుతున్నాడు. నిందితుడిని విచార‌ణ నిమిత్తం జైపూర్ త‌ర‌లించిన‌ట్లు రాజ‌స్థాన్ పోలీసు ఏడీజీ(ఇంటెలిజెన్స్‌) ఉమేశ్ మిశ్రా తెలిపారు.