హైదరాబాద్: స్పుత్నిక్ వీ టీకాల పంపిణీ ఇండియాలో ప్రారంభమైన విషయం తెలిసిందే. రష్యాకు చెందిన ఆ వ్యాక్సిన్ను .. మన దేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది. ప్రస్తుతం పైలట్ పద్ధతిలో టీకాలను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే స్పుత్నిక్ వీ టీకాలు ఇక నుంచి మరో 9 నగరాల్లో అందబాటులోకి వస్తాయని ఇవాళ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఆ నగరాల జాబితాలో తెలంగాణకు చెందిన మిర్యాలగూడ ఉన్నది. ఇక మిగితా నగరాల్లో బెంగుళూరు, ముంబై, చెన్నై, విశాఖపట్టణం, బడ్డి, కోల్హాపూర్లు ఉన్నాయి. తొలుత ఈ టీకాను హైదరాబాద్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్పుత్నిక్ వీ టీకాలను కోవిన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం లేదు. పైలట్ లాంచింగ్ ప్రక్రియ తుది దశలో ఉన్నదని, రెండు డోసుల టీకాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుందని రెడ్డీస్ ల్యాబ్ చెప్పింది. మైనస్ 18డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద స్పుత్నిక్ వీ టీకాలను నిల్వ చేస్తారు.