National
- Dec 05, 2020 , 01:56:37
రోడ్లు ఊడ్చేముందు నీళ్లు చల్లండి

- మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్జీటీ ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంతోపాటు (ఢిల్లీ ఎన్సీఆర్) ‘వాయు నాణ్యత’ అధ్వానంగా ఉన్న నగరాల్లో రహదారులను ఊడ్చే ముందు వాటిపై నీళ్లను చిలకరించాలని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఇందుకు మురుగు శుద్ధి ప్లాంట్ల నుంచి నీటిని వాడాలని, స్వచ్ఛమైన నీటిని వాడొద్దని సూచించింది. ఈ మేరకు ఎన్జీటీ చైర్పర్సన్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. అలాగే కాలిబాట పక్కన గడ్డిని లేదా మూలికలను నాటాలని సూచించింది. మెట్రో నగరాల్లో రోడ్లను ఊడ్వడం ద్వారా తలెత్తుతున్న ధూళి కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్ఎస్ విర్క్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ పై విధంగా ఆదేశాలిచ్చింది.
తాజావార్తలు
- శెభాష్...సిరాజ్: మంత్రి కేటీఆర్
- త్వరలో కామన్ మొబిలిటీ కార్డు: ఇక హైద్రాబాదీలకు ఫుల్ జాయ్
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- ఖమ్మంలో భారీగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత
- 60 ట్రాక్టర్ల ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు
- ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు బెదిరింపులు
- ఆవిష్కరణల హైదరాబాద్.. సౌరవిద్యుత్‌లో బాగుబాగు
- రన్ వే పై చిరుత రయ్.. రయ్...! వీడియో వైరల్... !
- విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- మరో 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో..ప్రీ-బుకింగ్స్ ప్రారంభం
MOST READ
TRENDING