గురువారం 09 జూలై 2020
National - Jun 26, 2020 , 14:25:09

మిడ‌త‌ల బెడ‌ద‌: ఫైరింజ‌న్ల‌తో ర‌సాయ‌నాల పిచికారి

మిడ‌త‌ల బెడ‌ద‌: ఫైరింజ‌న్ల‌తో ర‌సాయ‌నాల పిచికారి

ల‌క్నో: సౌదీ ఆరేబియాలోని ఎడారి ప్రాంతం నుంచి పాకిస్థాన్ మీదుగా దేశంలో ప్ర‌వేశించిన ఎడారి మిడ‌త‌లు ప‌లు రాష్ట్రాల్లో పంట‌లను నాశ‌నం చేస్తున్నాయి. రాజ‌స్థాన్, పంజాబ్‌, మ‌హారాష్ట్ర, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఈ మిడ‌త‌ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న‌ది. ప్ర‌స్తుతం యూపీలోని వార‌ణాసి ప‌రిస‌ర ప్రాంతాల్లో మిడ‌త‌ల దాడి కొన‌సాగుతున్న‌ది. దీంతో స్థానిక అధికారులు మిడ‌త‌ల నిర్మూల‌న కోసం పంట‌ల‌పై ర‌సాయ‌నాల‌ను పిచికారీ చేస్తున్నారు. గ‌త రాత్రి వార‌ణాసి ప‌రిధిలోని న‌యేపూర్ ఏరియాలో ఆరు ఫైరింజ‌న్ల‌తో ర‌సాయ‌నాల‌ను పిచికారీ చేశారు.   ‌ 


logo